స్థానిక వార్తలు

నిరుపేద కుటుంబాలకు ఇళ్లు

Reporter
Shiva Kumar Prakasam Reporter
3 months ago
◉ 10 Views
News Image

గాయత్రి న్యూస్ ,వరంగల్ మహానగరం: నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు వెంటనే నివాసం ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. శాయంపేటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బ్లాక్‌లను ఆమె ఆకస్మికంగా పరిశీలించి, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇళ్లు మంజూరై కేటాయింపు పూర్తయిన వారు వెంటనే ఇళ్లలోకి వెళ్లాలని కోరారు. లబ్ధిదారులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 19 బ్లాక్‌లకు గాను 6 బ్లాక్‌లకు విద్యుత్ సౌకర్యం ఉందన్నారు. మిగతా బ్లాక్‌లకు వారం రోజుల్లో విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం