భూగర్భ జలాల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి గుంతకల్‌లో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాలు, రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు RDO శ్రీనివాసులు,
Shiva Kumar
Prakasam Reporter
◉
26 Views
గాయత్రి న్యూస్ ,గుంతకల్లు: గుంతకల్‌లో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాలు, రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు RDO శ్రీనివాసులు, DLDO జి.ఎన్.ఎస్.రెడ్డికి వినతి అందించారు. జిల్లాలో 15–20 వేల ఇంకుడుగుంటలకు గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంకుడుగుంటలు, చెక్‌డ్యామ్‌లు, రీచార్జ్ పిట్స్ ఏర్పాటు చేయడంతో పాటు చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు మైక్రో ఇరిగేషన్, నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరారు. జనతా వారధి కన్వీనర్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జీలకర్ర విక్రమ్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు వనగుంది విజయలక్ష్మి, గుర్రం సూర్యనారాయణ, విశ్వనాథ్, రాకేష్, గోవిందు,విష్ణు తదితరులు పాల్గొన్నారు