కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సీఐ బాలసురేష్ బాబు,ఎస్ఐ రాజారెడ్డి,పోలీసు సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు.దేశ స్వాతంత్ర్యంకోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ పట్ల పోలీసు సిబ్బంది తమనిబద్ధతను చాటుకున్నారు. పాఠశాల విద్యార్థులు పాల్గొని క్రమశిక్షణతో జాతీయగీతాలను ఆలపించారు.పోలీసు సిబ్బంది విద్యార్థులకు స్వీట్లు అందించి అభినందించారు.పోలీస్ అధికారులు సుకుమార్, నాగేశ్వరరావు,మధు పాల్గొన్నారు.