మార్కాపురంలో మెగా ఉచిత వైద్య శిబిరం
Shiva Kumar
Prakasam Reporter
◉
9 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ గురువారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. తర్లుపాడు రోడ్డులోని కేఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో ఈ శిబిరం జరగనుంది. ఈ శిబిరంలో ఒంగోలుకు చెందిన ఆస్టర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు అందించనున్నారు. న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, వైద్యుల సలహాలు, అవసరమైన మందుల పంపిణీ వంటి సేవలు అందించనున్నారు. మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.