మేడిగడ్డ బ్యారేజీకి 1,54,700 క్యూసెక్కుల వరద
Puthala Naveen
Mandal Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం రెండ్రోజులుగా పెరుగుతోంది. గురువారం ఉదయం బ్యారేజీలోకి 1,54,700 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా ఉన్నట్లు ప్రాజెక్ట్ ఈఈ సురేశ్ వెల్లడించారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.