సద్దుల బతుకమ్మతో ప్రతి ఇంటా సంతోషాల వెల్లువ. సర్పంచ్ విజయలక్ష్మి-శంకర్
Puthala Naveen
Mandal Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహాదేవపూర్ మండలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహాదేవపూర్ మండలం పాల్గుల-కుంట్లం సర్పంచ్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతుందని ఆమె పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషాలు నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని విజయలక్ష్మి-శంకర్ ఆకాంక్షించారు.