దారిదోపిడి కేసును ఛేదించిన కుక్కునూరు పోలీసులు
Gayathri News
Nag
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండలంలోని వింజరం గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వసుమతి అనే మహిళ మెడలో బంగారు నాంతాడును లాక్కొని వెళ్లిపోయిన కేసును కుకునూరు ఎస్సై రాజారెడ్డి,సీఐ బాల సురేష్ బాబు, పోలీసు సిబ్బంది చేధించారు.మండలంలోని వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద ముద్దాయిలను అరెస్టు చేసి, వారి నుంచి బంగారు నాంతాడును, కారును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.72 గంటల్లో కేసును ఛేదించిన కుక్కునూరు ఎస్ఐ,సీఐ పోలీసులను జిల్లా ఎస్పీ కె .ప్రతాప్ శివకిషోర్ అభినందించారు.