ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు - ముఖ్యాంశాలు
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 12 కీలక అంశాలకు ఆమోదం లభించింది. తల్లికి వందనం (2026-27): మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు ఆమోదం. అదనంగా 58,060 మంది చేరికతో మొత్తం లబ్ధిదారులు 68,57,880 మంది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ:విధి నిర్వహణలో మరణించిన వారికి ఏడాది సర్వీసుకు ₹5,000 చొప్పున గరిష్ఠంగా *₹1.50 లక్షల గ్రాట్యుటీ. రేపల్లె CHC అప్గ్రేడేషన్: 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్పు (₹58.42 కోట్లు, 66 కొత్త పోస్టులు). APHIMS ప్రాజెక్టు: ₹20.62 కోట్లతో హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్:విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఉచిత IIT-JEE, NEET రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్. డైట్ ఛార్జీల పెంపు: సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపునకు ఆమోదం