సీతారాం ఏచూరి స్ఫూర్తితో ప్రజాపోరాటాలు
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు,ఆగస్టు12 : సుందరయ్య భవనం ప్రజాసంఘాల కార్యాలయంలోబుధవారం సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లాకమిటీసభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు,సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ రాజకీయాల వరకు ప్రజాస్వామ్యం,లౌకికవాదం,సామాజిక న్యాయం,శాస్త్రీయఆలోచనల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారని తెలిపారు.