స్థానిక వార్తలు

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా!

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 25 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: సోమవారం (సెప్టెంబర్ 28) నుండి మూడు రోజుల పాటు జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యు ఎఫ్ బి యు) ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై చర్చించేందుకు ఇరు వర్గాలతో ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం నుండి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు సాధారణంలాగే అందుబాటులో ఉంటాయని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం