ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
Puthala Naveen
Mandal Reporter
◉
16 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో ఇటీవల మరణించిన మడె సమ్మక్క కుటుంబాన్ని ఆదివాసీ కొమరం భీమ్ యూత్ సభ్యులు పరామర్శించారు. గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ యూత్ సభ్యులు చిడం కిరణ్, రాజు,ప్రభాష్,అరుణ్,రాజు,రవి,అల్లి చందు, పాయిలి సంతోష్,శివ,మెక్కల రంజిత్,ఎడాం బన్నీ, తాడండ్ల రంజిత్, గ్రామ పెద్దలు చిడం ధర్మయ్య, మెక్కల కిషన్,చిడం మల్లేష్, సమ్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.