పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Menchu Bhojanna
Adilabad Incharge
◉
48 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కార్బారి భోజన్న (55) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా ఆవు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను భైంసాకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.