స్థానిక వార్తలు

రాజమండ్రిలో పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,కాకినాడ: జాతీయ పోషణ్ మాసోత్సవాలు–2026లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) కాకినాడ క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గారు మంగళవారం ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో ఆరోగ్యవంతమైన సమాజం కీలకమని, మహిళలు, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై రూపొందించిన ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రచురణలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీబీసీ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం