జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతదృష్ట్యా పాఠశాలల పరిసరాలను పరిశీలించి,అవసరమైన భద్రతా చర్యలు చేపట్టా లని జిల్లా విద్యాశాఖాధికారి M.వెంకటలక్ష్మమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.పరిస్థితి తీవ్రంగాఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించేలా నిర్ణయాలు తీసుకోవాలని, విద్యార్థులు,తల్లిదండ్రులు,టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిఈఓ సూచించారు.