స్థానిక వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం..

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
2 months ago
◉ 50 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: ఊపందుకున్న కాంగ్రెస్.. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మునిపెన్నడూ లేని విధంగా 3613 స్థానాల్లో ఘనవిజయం సాధించిందని పేర్కొంటూ శ్రీకాళహస్తిలో ఆ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మరింత పెరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమన్నారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, సురేంద్ర రెడ్డి, ప్రేమసుందరం, సుధా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం