రైతులపై కక్ష సాధిస్తున్న కూటమి ప్రభుత్వం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండల నిర్వాసిత రైతులకు యూరియా అందించకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుక్కునూరు మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ విమర్శించారు. జిల్లా లోనే అత్యధికంగా మిర్చి సాగుచేస్తున్న కుక్కు నూరు మండల రైతుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే అవసరమైనమేరకు యూరి యాను అందించాలని ఆయన డిమాండ్ చేశారు.