మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి,ఏలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు.2019-2022 మధ్య ఏపీ ఉప ముఖ్యమంత్రిగా,ఆరోగ్యశాఖమంత్రిగా ఆయన సేవలు అందించారు. ఏలూరు నియోజకవర్గం నుండి 3 సార్లు (2004, 2009, 2019) ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017-2019 కాలంలో ఎమ్మెల్సీగా బాధ్యతలునిర్వహించారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, ఇటీవల టీడీపీలో చేరారు.నాని మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.