మాలేగాం పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ
Menchu Bhojanna
Adilabad Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఎంఈవో విజయకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి, వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు