టిడిపి ఇంటింటిప్రచారంలో మహిళలు ముందంజ
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలఅధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం జోరుగా సాగుతోంది.ఈ సందర్భంగా నాగు మాట్లాడుతూ గత రెండేళ్లలో ప్రజలకుఅందించిన సంక్షేమ పథకాలు,పంచాయతీలలో అభివృద్ధిని ప్రజలకు వివరించారు.అమలుచేసిన సంక్షేమ పథకాలపైరూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, అన్ని గ్రామాల, ప్రజల సమస్యలను గురించి అడిగితెలుసుకున్నారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగన్న హామీ ఇచ్చారు.ఇంకామూడేళ్లలో ఎన్నికల హామీలన్ని కూటమిప్రభుత్వం నెరవేరుస్తుందని హామీఇచ్చారు.