తెలుగు గంగ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
M Munirathnam
Srikalahasthi Reporter
◉
34 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మండలం చిన్న సింగమల సమీపంలోని తెలుగు గంగ కాలువలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకురావడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ కే. నాగరాజు, సిబ్బంది స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఇతని గురించి సమాచారం తెలిసిన వారు 944900008 కి సంప్రదించాలని సీఐ కోరారు.