రాజకీయాలు

తల్లీబిడ్డల భద్రతకు 102 సేవలు

Reporter
RANJITH KUMAR Srikalahasthi Reporter
3 months ago
◉ 13 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్–102’ ప్రత్యేక వాహన సేవలను మంగళవారం ప్రారంభించారు. ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను ఉచితంగా, సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు జీ. విజయకుమార్‌నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది వాహనాన్ని ప్రారంభించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు ఈ ఉచిత రవాణా సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ