ఏలూరులో మురికిగా మున్సిపల్ వాటర్
Prabhakar
Ealuru Incharge
◉
33 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరుసిటీలోని తంగెళ్ళమూడి వేణు గోపాల స్వామిఆలయం వద్ద ఇళ్ళలోకి వచ్చే మున్సిపల్ వాటర్ రసాయనాలు,వ్యర్థపదార్థాలు కలిసిన మాదిరిగా మురికినీరు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ నీరు కుళ్ళిపోయిన వాసన వస్తుండటంతో భరించలేక పోతున్నామని,ఆ నీటిని ఇంటి అవసరాలకు ఉపయోగించలేకపోతున్నామని,కాసేపు బకెట్ల లోకూడా ఆ నీటిని ఉంచలేకపోతున్నామని చెబుతున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించకపోతే రోగాలు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.