ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ చేపట్టండి
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,వరంగల్ మహానగరం: *ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ చేపట్టండి: : హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్* కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్.శ్వేత తో కలిసి విస్తరిత ప్రాంత పరిశీలన... ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హన్మకొండ రాంనగర్ ప్రాంతం లో (పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనుక వైపు) నగర పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి విస్తరిత ప్రాంతాన్ని పరిశీలించి సమర్థవంతం గా చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రాం నగర్ ప్రాంతం లో 15 ఫీట్ల రోడ్డు ఉండడం వల్ల వాహన దారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు ఫిర్యాదులు అందయి అన్నారు.