వినాయక చవితి వేడుకలపై సీఐ వెంకటేష్ సూచనలు
M Munirathnam
Srikalahasthi Reporter
◉
25 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో విగ్రహాల నిర్వాహకులు, ఉత్సవ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరని, ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్, అగ్ని భద్రత, శబ్ద నియంత్రణ నిబంధనలు పాటించాలని, ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తూ వేడుకలను సోదరభావంతో నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.