పదిరోజుల్లో లోఓల్టేజ్ సమస్య తీర్చుతాం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా సూపరింటెడెంట్ ఇంజనీర్ అంబేద్కర్, మండలంలో విద్యుత్ సరఫరాలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి బుధవారం కుక్కునూరు సబ్ స్టేషన్ కు వచ్చారు. టిడిపిమండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు శాలువాతో సన్మానించారు.లోఓల్టేజ్ సమస్యను పరిష్కారించాలని కోరారు.ప్రతి గ్రామానికికూడా విద్యుత్ సరఫరా జరిగే విధంగా పది రోజుల వ్యవధిలో పరిష్కారం చూపుతానని ఎస్ ఈ హామీనిచ్చారు. మండల ప్రధాన కార్యదర్శి చుంచు సత్యనారాయణ,సీనియర్ నాయకులు రమణరాజు,పులిశ్రీను, బొల్లు కృష్ణ,ఏసుబాబు,ఉదయ్ పాల్గొన్నారు