శిర్సాతో లోకేశ్ సమావేశం
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: ఢిల్లీ మంత్రి మన్జిందర్ సింగ్ శిర్సాతో లోకేశ్ సమావేశం సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి బృందానికి స్వాగతం పలికిన లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ఆకర్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్ధి విధానం బాగుందని శిర్సా ప్రశంసించారు. అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏపీ ప్రభుత్వ సహకారం కోరారు.