స్థానిక వార్తలు

పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభo

Reporter
Shiva Kumar Prakasam Reporter
2 months ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,కర్నూలు: మాధవరం తండాలో పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సహచర మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 2,000 మంది లబ్ధిదారులకు సుమారు రూ.25 కోట్ల వ్యయంతో సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ఉచితంగా అందించారు. ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడమే పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. పర్యావరణహిత సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తి నాగరాజు, ఎమ్మెల్యేలు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ముత్తుమూల అశోక్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పత్రికా దినోత్సవం
ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు