కుభీర్ : పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి
Menchu Bhojanna
Adilabad Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుభీర్ : పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి ( Kalyanalakshmi ) షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్‌ఎస్ (BRS ) ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుశుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి తహసీల్ కార్యాలయం వద్ద బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు అన్నబావు సాటే, చత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ విఠలేశ్వరాలయంలో