ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,నిర్మల్: నిర్మల్: అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. 18-59 ఏళ్ల ప్రధాన సంపాదనపరుడికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులు ఆధార్, నామినీ వివరాలతో శిబిరాలకు హాజరై నమోదు చేసుకోవాలని సూచించారు.