మంగళగిరిలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం
Shiva Kumar
Prakasam Reporter
◉
20 Views
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించే లక్ష్యంతో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంగళగిరిలో ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు ఉన్నత స్థాయి క్రికెట్‌లో అవకాశాలు కల్పించేందుకు ఈ లీగ్ దోహదపడనుంది. ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆమె భాగస్వామ్యం యువ క్రీడాకారిణులకు ప్రోత్సాహాన్ని అందించనుంది. యువ ప్రతిభను విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు, అక్కడి నుంచి భవిష్యత్తులో భారత జట్టుకు తీసుకెళ్లేలా మార్గం సుగమం చేయడంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలకంగా వ్యవహరిస్తోంది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో యువ క్రీడాకారిణులు తమ సత్తా చాటుకోనున్నారు.